Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి
నవతెలంగాణ- వనస్థలిపురం
వరంగల్ డిక్లరేషన్ చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు బాంధవుడు అయ్యాడని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ వ్యవహారాల ఇన్చార్జ్ మల్లు రవి అన్నారు. వరంగల్ డిక్లరేషన్ను నేటి నుంచి నెల రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా గడపగడపకు ప్రచారం చేసి ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం వనస్థలిపురంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మల్ రెడ్డి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లురవి మాట్లాడారు. వచ్చే ఎలక్షన్లలో తెలంగాణలో కాంగ్రెస్ హయాంలోకి రాగానే 30 రోజుల్లో రైతుల రెండు లక్షల రుణాన్ని మాఫీ చేయనున్నట్లు చెప్పారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించే సమయం ఆసన్నమైందని, ఈ రైతు డిక్లరేషన్ ఏకే-47 లాంటిదని హెచ్చరించారు. తెలంగాణలో ధరణి వ్యవస్థను మాఫీ చేసి కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు, రైతు పండించిన పంటకు ప్రభుత్వం కొనుగోలు చేసి సరసమైన రేట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ విధానంలో అవకతవకలకు పాల్పడకుండా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు ఏకమయ్యే పరిస్థితి ఆసన్నమైందన్నారు. ఎల్బీ నగర్ ఇన్చార్జ్ మల్ రెడ్డి రామ్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివద్ధి కుంటుపడిందని, ఈ విధంగా స్థానిక ఎమ్మెల్యే వ్యవహరించటం దురదష్టకరమన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక అభివద్ధి గుంతలమయం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, వనస్థలిపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంట్ల నరసింహ యాదవ్, బీఎన్.రెడ్డి డివిజన్ అధ్యక్షుడు మకుటం సదాశివుడు, హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.