Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శుక్రవారం గోల్నాక డివిజన్ పరిధిలోని తిరుమలనగర్ లో రూ.17 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్నాక డివిజన్ను నగరంలోని అత్యంత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లింగం గౌడ్, తూర్పు రామ్ చందర్, ఆర్ కె.బాబు, రాచకట్ల దేవేందర్, గోపాల్, స్థానిక బస్తీ పెద్దలు పాల్గొన్నారు.