Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిపై పందులు దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని బందావన్ కాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి వివరాల ప్రకారం బోడుప్పల్ బృందావన్ కాలనీకి చెందిన ఆవుల వెంకట్ గత ఆదివారం ఉదయం సమయంలో బృందావన్ కాలనీ నుంచి వెళ్తుండగా వీధిలో ఉండే పందులు విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా తలకు, దవడ, ముఖానికి గాయాలు కావడంతో సుమారు 25 కుట్లు పడ్డాయని తెలిపారు. ఓ వైపు వీధి కుక్కల దాడిలో ఇప్పటికే చిన్నారులకు గాయాలు కాగా ఇప్పుడు పందుల దాడిలో పెద్దలు గాయపడటంతో రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు.