Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ప్యారాసాని లక్ష్మీనరసింహ చారీ ట్రబుల్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మర్రి అరుంధతి హాస్పిటల్ వారి సౌజన్యంతో బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ శుక్రవారం లాల్‌దర్వాజ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ కుమార్ మాట్లాడు తూ పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అనారోగ్యంతో బాధపడుతున్న లాల్ బజార్ శాస్త్రి నగర్‌కు చెందిన ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి నిర్వహించిన ఈ శిబిరంలో నిష్ణాతులైన వైద్యులు బీపీ, షుగర్ పరీక్షలు, కన్ను, ముక్కు, చెవి సంబంధించిన పరీక్షలు కూడా చేశారు. ఆర్థోపెడిక్స్ విభాగాల్లో పరీక్షలు జరిపి 150 మందికి మందులు అందజేశారు. రోగ నిర్ధారణ పరీక్షలు అవసరం ఉన్న వారిని మళ్లీ ప్రత్యేకంగా హాస్పిటల్‌కు తీసుకెల్లి చికిత్స తో పాటు వైద్య సేవలు అందజేయనున్నట్టు శ్యామ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అరుంధతి హాస్పిటల్ డీన్ ఉదరు కుమార్, జిల్లా నోడల్ అధికారి నాయిని ఉదరు రంజన్ గౌడ్, శ్యామ్ కుమార్ టీం యువసేన, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.