Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
సరూర్‌నగర్ డివిజన్లోని చౌడి, బాపునగర్, కుమ్మరబస్తీలో పైప్‌లైన్ సమస్యలు, శానిటైజేషన్ సమస్యలు గుర్తించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఇంజనీరింగ్, శానిటైజేషన్ అధికారులను కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ ఆదేశించారు. ఆదివారం మార్నింగ్ వాక్‌లో భాగంగా డివిజన్లోని సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు అధికారులతో సహా పర్యటించారు. మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్నందున పైపులైను పనులు, శానిటేషన్ పనులను గుర్తించి పూర్తి చేయాలని అన్నారు. సురేష్, కిరణ్, చిన్నా, నర్సింహ, సందీప్, స్థానికులు పాల్గొన్నారు.