Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ప్రముఖ సంఘ సంస్కర్తలు భాగ్యరెడ్డివర్మ, రాజా రామ్మోహన్ రారు జయంతుల సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కతిక కేంద్రం స్పూర్తి గ్రూపు ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. కమలానగర్ ఆఫీసులో స్పూర్తి గ్రూప్ సభ్యులు గొడుగు యాదగిరి రావు అధ్యక్షత వహించారు. ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు ప్రసంగిం చారు. హైదరాబాదులో పుట్టి పెరిగిన భాగ్యరెడ్డివర్మ మూలవాసులను అణిచి వేసి వారిని అంటరానివారిగా అతిహీనంగా చూడటం సహించ లేదనీ, వారిని ఆది హిందువులుగా గుర్తించాలని భాగ్యరెడ్డి వర్మ పోరాటం చేశారన్నారు. బాలికల విద్య గురించి పోరాడి అనేక విద్యాలయాలను నిర్మించారని తెలిపారు. రాజా రామ్మో హన్ రారు సతీసహగమనాన్ని వ్యతిరేకించి పెద్ద ఎత్తున పోరాడి దాన్ని రద్దు కోసం ప్రయత్నించటం వల్ల చట్టం తీసుకొచ్చినట్టు తెలిపారు. ప్రముఖ రచయిత పీబీ చారి మాట్లాడుతూ వారు చేసిన కృషి ఫలితంగా సంస్కరణ ఉద్యమాలు ముందుకు వచ్చాయన్నారు. నేడున్న పరిస్థితుల్లో వాటిని మరింత ముందుకు తీసుకె ళ్లాలని కోరారు. ప్రజల్లో నేడున్న బాబాలను ప్రజా సంస్కతి పురోభివృద్ధికి వారి ఆదర్శాలను ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజా చైతన్యంతో నేడున్న పాలకుల దురాచారాలను వెనక్కు కొట్టాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ నాయకులు వెంకట సుబ్బయ్య, వెంకట్, పాషా, యువ కళాకారుడు రాజ్ కిరణ్, బసవపున్నయ్య, శ్రీనివాస్, ఆండాలిపాల్గొన్నారు.