Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని నేతాజీనగర్ కాలనీ వాసులు స్వంత నిధులతో నిర్మించుకున్న ఆర్చిని ఆది వారం ఎల్.బి.నగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు
శుభాకాంక్షలు తెలుపుతూ కాలనీ అభివద్ధి పనులకు వెన్నంటే ఉంటూ ఎల్లవేళలా వారి సహాయ సహకారాలు అందిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెన్నగొని శ్రీధర్‌గౌడ్, సీనియర్ నాయకులు నక్క.రవీందర్ గౌడ్, భాస్కర్ సాగర్, గజ్జి భాస్కర్ యాదవ్, కాలనీ అధ్యక్షులు సూర్య శ్రీనివాస్ రెడ్డి, గజ్జి సుధాకర్ యాదవ్, రవీందర్‌రెడ్డి, కాశీనాథ్, శ్రీశైలం, అభినవ్, షబ్బీర్, లాజర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.