Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్స్‌తో అవగాహనా ఒప్పందం చేసుకుంది. ఇది భారత్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్‌ను అమలు చేయడంలో ఏఐసీటీఈ ఏడు అధీకృత హైపర్‌లెడ్జర్ ట్రైనర్, టెక్నాలజీ పార్టనర్లలో ఒకటి. ఈ ఒప్పందం వల్ల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం, స్టూడెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, ప్రాజెక్ట్ మెంటర్షిప్, ఇంటర్న్‌షిప్, రీసెర్చ్ అండ్ ప్లేస్మెంట్స్పై ఎంఎల్ఆర ్ఐటీ, ఐడీఎస్ మధ్య సహకారాన్ని దృవీకరిస్తుంది. ఈ ఒప్పందం మూడేండ్లపాటు ఉంటుంది. ఎంఎల్ఆర్ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్‌రావు, ఈ.అనుప్రియ, అరవింద్ ఓరుగంటి, వైస్ ప్రెసిడెంట్ ఒప్పందంపై సంతకం చేశారు. ఎంఎల్ఆర్ఐటీ 4వ సంవత్సరం విద్యార్థుల కోసం ప్రాజెక్ట్ ఎక్స్పోను కూడా నిర్వహించింది. 53 ప్రాజెక్ట్‌లలో 15 ప్రాజెక్ట్‌లు రెండో రౌండ్‌కి షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి. 1, 2, 3, కన్సోలేషన్ స్థానాలకు నాలుగు ప్రాజెక్ట్‌లు ఎంపిక చేయబడ్డాయి. జాబ్ ఇంటర్న్‌గా ఐడీఎస్‌లో చేరడానికి ఆఫర్ ఇచ్చిన ఇద్దరు విద్యార్థులు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, డాక్టర్ అనుప్రియ, అరవింద్ వోరుగంటి - వైస్ ప్రెసిడెంట్-ఐడీఎస్ సునీల్ యడవల్లి విజేతలను సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇదివరకు ఎంఎల్ఆర్ఐటీ పలు అంత్జాతీయ సంస్థలతో కలిసి అవగాహనా ఒప్పందాలు చేసుకుందన్నారు. నేడు మరొక ప్రముఖ సంస్థ ఆ జాబితాలో చేరడం సంతోషకరమన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతో మేలు చేకూరుతు ందని తెలిపారు. ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్వహించిన కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వారిని అభినందించి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.