Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కోఠి ఈఎన్టీ (ముక్కు, గొంతు, చెవి)లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ అన్నారు. ఆదివారం కోఠి ఈఎన్టీ గోల్డెన్ జూబ్లీ బ్లాక్‌లోని చాంబర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోగులకు అవసరమయ్యే అన్ని వైద్య పరీక్షలు ఆస్పత్రిలో నిర్వహిస్తున్నామన్నారు. ఆస్పత్రిలో రెండు సిటి స్కాన్లు రోగులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామన్నారు. ఇటీవలే రూ.35 కోట్లతో ఇంటిగ్రేటెడ్ భవనానికి వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఈ భవనం నిర్మాణం పూర్తి అయ్యి అందుబాటులోకి వస్తే రోగులకు సేవలు విస్తత పరచవచ్చు అన్నారు. మాటలు రాని చిన్న పిల్లలకు స్పీచ్ థెరఫీ ఇస్తూ వారు మాట్లాడేలా చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు రోగులు వినియోగించుకోవాలని సూచించారు. రోగులకు ట్రాకియల్ సైనోసిస్, థైరాయిడ్ క్యాన్సర్, థైరాయిడ్ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. క్రాంక్లియర్ ఇంప్లాటేషన్ (ఐఎంపీఎల్ ఏఎన్‌టీ) ఆపరేషన్లు జూన్ ఒకటో తేదీ నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇక రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటవెంటనే అవసరం ఉన్న రోగులకు ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు.