Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటర్ బోర్డు ఎండీ దాన కిషోర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
వెన్నెముక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైదరాబాద్ వాటర్ బోర్డు ఎండీ దాన కిషోర్ అన్నారు. ఏషియన్ స్పైన్ హాస్పిటల్, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద నిర్వహించిన వాకథాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్నెముక ఆరోగ్యంపై ముందస్తు చర్యలు తీసుకుంటే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరాన్ని నిరోధించవచ్చు అని తెలిపారు. సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఏషియన్ స్పైన్ హాస్పిటల్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ సురా మాట్లాడుతూ చికిత్స కంటే నివారణ ఎల్లప్పుడూ ఉత్తమన్నారు. వెన్నెముక సమస్యలు ఉన్నవారు శారీరకంగా చురుగ్గా ఉండటం, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండేలా చూసుకోవడం, శారీరక సామర్థ్యాలకు సరిపడని బరువులు ఎత్తకుండా ఉండటం వంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని వివరించారు. కార్యక్రమంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ మిషన్ డైరెక్టర్ అబ్దుల్ వహీద్, బ్రాడ్జ్రిజ్ చైర్మెన్ వి.లక్ష్మీకాంత్, ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సీఈవో, డైరెక్టర్ నరేష్ కుమార్ పగిడిమర్రి, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈవో మయూర్ పట్నాల, నానో హెల్త్ సీఈవో మనీష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.