Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో అమ్ము ఎంటర్టైన్మెంట్ నూతన నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ గ్రామీణ నేపథ్యంగా సాగే సినిమాకు నూతన నటీనటులు ఎంపికకు ఆడిషన్ు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో చిత్ర సాంకేతిక నిపుణులతో పాటు దర్శక, నిర్మాతలు చిత్ర వివరాలను పత్రికా విలేకరులకు తెలిపారు. దర్శకుడు ఎస్. ఎస్. వర్మ, నిర్మాత సత్య జగదీష్ కోసురు మాట్లాడుతూ సోమ, మంగళవారం నూతన నటీనటుల ఎంపికకు ఆడిషన్ జరిగిందని ఎంట్రీలు ఎక్కువగా వచ్చినప్పటికీ అందరినీ ఆడిషన్‌కు పిలవలేక పోయామని తెలిపారు. నటులు ఎంపిక పూర్తయిన తర్వాత జూన్‌లో నట శిక్షణ శిబిరం నిర్వహించి ఆగస్టు నుంచి షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. నిర్మాత సత్య జగదీష్ మాట్లాడుతూ మిట్టపల్లి సురేందర్ కథ అందించారని, హీరోగా డాక్టర్ విశ్వాస్, కెమెరా మాన్‌గా పవన్ గుంటూను ఎడిటర్‌గా వర, ఇప్పటి వరకు కొత్తవారిని ఎంపిక చేశామని తెలిపారు. జార్జి రెడ్డి, విరాట పర్వ్యంలాంటి సినిమాలకు సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి సంగీత దర్శకునిగా అంగీకరించారని తెలిపారు. సురేష్ బొబ్బిలి మాట్లాడుతో ప్రాంతీయ నూతన గాయనీ గాయకులను పరిచయం చేస్తామన్నారు. సహకారం అందించిన సంచాలకులు మామిడి హరికష్ణకు సాంస్కతిక శాఖా మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.