Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
నవతెలంగాణ-బాలానగర్
రానున్న వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చుర్యలు తీసుకుంటున్నట్టు కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి తెలపారు. ముందస్తు చర్యల్లో భాగంగా డివిజన్ పరిధిలోని వివిధ బస్తీలు, కాలనీలలో ఈదురు గాలులకు విద్యుత్ అంతరాయం కలుగకుండా చెట్ల కొమ్మలను తొలగించామన్నారు. మంగళవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్లో స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులతో కలిసి అక్కడికి వెళ్లి ల్యాడర్ సహాయంతో చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ తీగల మధ్యలో స్పేసర్స్ వేయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ దుర్గాప్రసాద్, లైన్ ఇన్స్పెక్టర్ మధు, లైన్ మెన్ ప్రేమ్ కుమార్, ఫోర్ మెన్ అశోక్, జీహెచ్ఎంసీ హార్టికల్చర్ సిబ్బంది, వినాయక్ నగర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు కృష్ణమూర్తి, శ్రీనివాస రాజు, భీమారావు, శ్రీనివాస్ ముదిరాజ్, ఎలిజాల యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, యం.సుధాకర్‌రెడ్డి, మహమ్మద్ సోఫీ తదితరులు పాల్గొన్నారు.