Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
రామంతపూర్ డివిజన్ అభివద్ధికి నిధులు కేటాయించి అభివద్ధి కార్యక్రమాలు జరిగేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరుతూ రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి జోనల్ కమిషనర్ పంకజను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ అంబర్పేట్ అలీ కేఫ్ దగ్గర నుండి నాగోల్ వరకు ఉన్న 120 ''రోడ్డుకి ఇరువైపులా కబ్జాకు గురయిందని, ప్రభుత్వ భూములు కాపాడాలని, డివిజన్లోని శ్మశానవాటికలు రాజేంద్రనగర్, నేతాజీనగర్, బాలకష్ణ నగర్లోని శ్మశాన వాటికలను అభివద్ధి చేయాలని, చిన్న చెరువు సుందరీకరణ తక్షణమే చేపట్టాలని, డివిజన్లో వెనుకబడిన ఏరియాలు రాజేంద్రనగర్, ఇందిరానగర్, ఓల్డ్ రామంత పూర్లలో కొత్తగా 3 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని, డివిజన్లోని పలు రోడ్లలో వర్షపు నీరు నిలువకుండా రోడ్డు ప్యాచ్ వర్క్, పలు అభివద్ధి కార్యక్రమాలు నిధులు కేటాయించాలని విన్నవించారు. రామంతపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బండారు వెంకటరావు, వేముల తిరుపతయ్య, తాళ్ల బాలకష్ణ, సతీష్ పాల్గొన్నారు.