Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నెలక్నొ సమస్యలను పరిష్కరించాలని సీపీఐ బాలాపూర్ మండల కార్యదర్శి నరేందర్ డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న 32వ డివిజన్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్న విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మూత్రశాలలో ఉన్న పైపులైన్ పగిలి పోయి ఆ నీరు రోడ్ల పై ప్రవహిస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరూ పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పడమే ఆచరణలో కనిపించటం లేదన్నారు. మూడేండ్లుగా పాఠశాల చుట్టూ చెత్తా చెదారంతో నిండుకుని దురువాసనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవటం లేదన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారులను ఎందుకు సస్పెండ్ చేయకుడదో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా చేయాలని కోరారు.