Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు ఏడో వార్డు గన్ రాక్ కాలనీలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ సభ్యులు శ్యామ కుమార్ ఆధ్వర్యంలో గన్ రాక్ బస్తీవాసులు ఎమ్మెల్యే సాయన్నను మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గన్ రాక్ వాసులు తీవ్ర నీటిని నీటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారనీ, నూతనంగా పవర్ బోర్ వెల్ మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే సాయన్న స్పందించి సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని గన్ రాక్ కాలనీ వాసులకు హామీనిచ్చారు. ఎమ్మెల్యే కలిసిన వారిలో రాజారెడ్డి గన్ రాక్ కాలనీ వాసులు గోకులం, నవీన్, రమేష్ బాబు ఉన్నారు.