Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్, మండల అధ్యక్షులు
నవతెలంగాణ-శామీర్‌పేట
మంత్రి మల్లారెడ్డి మచ్చలేని నాయకుడని, వారి గురించి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, లేనిపోని మాటలు మాట్లాడితే తగిన బుద్ది చెబుతా మని లక్ష్మాపూర్ సర్పంచ్ సింగం ఆంజనేయులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మల్లేశ్‌గౌడ్‌లు అన్నారు. మంగళవారం మూడు చింతలపల్లి మండ లంలోని లక్ష్మాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అవాకులు, చెవాకులు పేలుతున్న రేవంత్‌రెడ్డి ఖబర్దార్ అన్నారు. సింగం ఆంజనేయులు మాట్లా డుతూ... లక్ష్మాపూర్ ఫేక్ రికార్డులు కొని స్వాతంత్య్ర సమరయోధుల భూములు, అటవీశాఖ భూములను కబ్జా చేసిన నీచ చరిత్ర కాంగ్రెస్ నాయకులదని, అంతేగాక నక్ష పూర్తికాకపోవడానికి స్థానిక నాయకుడే కారణం అన్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా అధికారులు రికార్డులు పూర్తిగా పరిశీలించి పట్టాదారు పాసుబుక్కులు ఇస్తున్నారని తెలిపారు. పాసు బుక్కుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంద న్నారు. రేవంత్‌రెడ్డి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే పరువు పోతుందన్నారు. రోడ్డు విస్తరణలో కుమ్మరి ఎల్లవ్వ భూమి ఒక గజం కూడా పోలేదని, రోడ్డు ఎత్తు పెరిగిందని కల్వర్టు గత 40 ఏండ్ల నుండి అక్కడే ఉందని తెలిపారు. అదే స్థానంలో నూతన కల్వర్టు నిర్మించినట్టు చెప్పారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్ మాట్లాడుతూ.... పూటకో పార్టీ మరే నైజం కలవారు ఆయన కుటుంబ సభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ పారుపల్లి నాగరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుండ్లపల్లి మల్లేష్‌గౌడ్, సీనియర్ నాయకుడు వనందాస్ మురళీగౌడ్, ఉద్యమ నాయకులు మంద స్వామి ముదిరాజ్, గ్రామశాఖ అధ్యక్షుడు గౌటే గోపాల్, ఉపాధ్యక్షుడు సింగం నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి బండి నవిందర్, సాయి శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.