Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దమ్ముంటే విచారణకు ఒప్పుకో?
- కాంగ్రెస్ మేడ్చల్-మల్కాజిగిరి
- జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి మంత్రి మల్లారెడ్డిది కాదని కాంగ్రెస్ మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్, మేడ్చల్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ వజ్రేష్ యాదవ్ అన్నారు. మంగళవారం కీసరలోని జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నంది కంటి శ్రీధర్ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి జోకర్ లా మాట్లాడుతున్నాడనీ, ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదనీ, కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే మల్లారెడ్డి రోడ్ల మీద తిరుగలేడని హెచ్చరించారు. లుంగీ కట్టుకుని ఇంట్లోనే కూర్చోవాల్సి ఉంటుందన్నారు. కంటోన్మెంట్ బంగ్లాను కమర్షియల్ చేసి నడుపుకుంటూన్నావనీ, జవహర్ నగర్ భూముల్లో హాస్పిటల్ కట్టుకున్న వాటికి సమా ధానం చెప్పాలని సవాల్ విసిరారు. డబ్బులతో మంత్రి పదవి, ఎమ్మెల్యే, ఎంపీ పదులను కొనుక్కున్న మల్లారెడ్డి కార్పొరేట్ టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. మంత్రి తన మీద ఉన్న అవినీతి, అక్రమాల విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. వజ్రేష్ యాదవ్ మాట్లాడు తూ నియోజకవర్గంలోని లక్ష్మా పూర్ గ్రామంలో రైతుల భూములు 3 వేల ఎకరాలు ఉండగా ప్రభుత్వ, ప్రవేట్ భూములను సపరేట్ చేయక, నక్ష ఏర్పాటు చేయక, పేద రైతులకు పాసు పుస్తకాలు రాక, ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు, బీమా రాక ఎందరో రైతులు నష్ట పోతున్నారన్నారు. గుండ్ల పోచంపల్లి మున్పిపాల్టీలో పార్కును కబ్జా చేసి దాంట్లో నుంచి రోడ్డు వేసుకుని దొంగ జడ్జిమెంట్లు తీసుకుని మోసం చేస్తున్నావన్నారు. మల్లారెడ్డి లాగ తమ పార్టీలో ఎవరూ మోసం చేయర న్నారు. మల్లారె డ్డివి అన్నీ సిగ్గు మాలిన పనులనీ, వీధి రౌడీల్లా ప్రవర్తనను మార్చుకోవాలని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో పిచ్చి కుక్కలను తరిమినట్టు తరిమే సమయం దగ్గరలోనే ఉందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గోగుల సరిత, కీసర మండల అధ్యక్షుడు క్రిష్ణ యాదవ్, దమ్మాయిగూడ అధ్యక్షుడు ముప్ప రామారావు, గుండ్ల పోచంపల్లి అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, జవహర్ నగర్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.