Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
హయత్‌నగర్ మండల పరిధిలో ప్రభుత్వ స్థలాలు కబ్జాల పాలవుతున్నా, చెరువులు, కాలువలు, నాలాలు కబ్జాల పాలవుతున్నా తమకేమీ సంబంధం లేనట్లు స్పందించకుండ, నిమ్మకుండ ఉండడంతో గతంలో పనిచేసిన తహసీల్దార్‌ను జిల్లా కలెక్టర్ బదిలీ చేశారు. తరువాత మరో మహిళా తహసీల్దార్ వచ్చినా అదే కబ్జాలపర్వం కొనసాగుతున్నది అనడానికి చెరువుల ఎఫ్టీఎల్ భూములు, హయత్ నగర్‌లోని బాతుల చెరువు, కుమ్మరికుంట రాచ కాలువలు కబ్జాకు గురైన విషయమై గతంలో ఉన్న కార్పొరేటర్ స్పందించేవారు. ఇప్పుడు దానిపై ఊసే లేదు. గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంజాపూర్ నుంచి రాచకాలువ పూడిక తీశారు. కానీ ఇప్పుడు ఆ కాలువల్లో నీరు లేకపోవడంతో అట్టి కాలువలు కనపడకుండా కనుమరుగయ్యాయి. ముదిరాజ్ కాలనీ వెనుక సైడ్, అదేవిధంగా గజ్జి పుల్లయ్య కాలనీ, ఇన్ఫర్మేషన్ కాలనీ మీదుగా బాతులు చెరుకు వచ్చే నీరు వధాగా పోవడానికి వీలుగా అయింది కాబట్టి కాలువపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఆ కాలువలు కనుమరుగయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ కాలువ పూర్తిగా కట్ చేసారు. కానీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తుఉండడం, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన వచ్చే వర్షాకాలంలో వరద నీరు ఏవిధంగా చెరువులోకి చేరుకుంటాయని వైఎస్ఆర్ సీపీ నాయకులు పుట్ట యాదయ్య ప్రశ్నించారు. లేనిపక్షంలో పేదలకు ఇళ్ళు నిర్మిస్తామన్నారు.