Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
తాగునీరు మురుగు నీటి నిర్వహణలో కార్మికులు కచ్చితంగా భద్రతా ప్రమాణాలను పాటించాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పని చేసే ప్రదేశంలో భద్రతా ప్రమాణాలు-జలమండలి అవగాహనా వారోత్సవాల్లో భాగంగా తార్నాక జలమండలి ఆధ్వర్యంలో శనివారం తార్నాక హనుమాన్ నగర్లో భద్రత అవగా హనా ర్యాలీ నిర్వహించారు. పని చేసే ప్రదేశంలో సిబ్బంది బ్యారికేడింగ్, సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు, సెల్ గ్రాబర్ల విని యోగం, హెడ్ లైట్‌తో కూడిన హెల్మెట్, గమ్ బూట్లు, మా స్కులు, వాటర్ ప్రూఫ్ దుస్తుల తప్పనిసరిగా ఉపయోగిం చాలని ఈ సందర్భంగా నగర డిప్యూటీ మేయర్ కార్మికు లతో ప్రమాణం చేయించారు. జలమండలి డిపార్ట్ మెంట్ ఇచ్చిన భద్రత పరికరాలను తప్పనిసరిగా ఉపయోగించు కుని ప్రమాదాలను నివారించుకోవాలని సూచించారు. మురుగు నీటి నిర్వహణ ఒక గౌరవ ప్రదమైన పని అనీ, ఈ పనిలో భాగస్వాములైన ప్రతి కార్మికుడినీ మనమం దరం గౌరవిద్దాం అని తెలిపారు. మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 155313ను సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నీటి కనెక్షన్‌తో ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, జలమండలి సీజీఎం ప్రభు, జనరల్ మేనేజర్ రమణా రెడ్డి, డీజీఎం దేవిడ్ రాజ్, మేనేజర్లు కృష్ణ ప్రసాద్, నికితా రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.