Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాంను ఆయన నివాసంలో కలిసి గిరిజన రిజర్వేషన్ 6శాతం నుంచి 10 శాతానికి పెంచాలని జరిగే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు కొర్ర శరత్ నాయక్ మాట్లాడుతూ రిజర్వేషన్ పెంచక పోవడం వల్ల 2014 నుంచి ఇప్పటి వరకు గిరిజన జనాభా ధామాషా ప్రకారం రాష్ట్రంలో తీసిన ప్రభుత్వ ఉద్యోగాల్లో దాదాపు 9వేలు ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలిపారు. మెడికల్, ఇంజినీ రింగ్, ఇతరత్రా వృత్తి రీత్యా కోర్సుల్లో ఉన్న గిరిజనులకు రావాల్సిన సీట్లు కోల్పోవడం చాలా బాధాకర విషయమ న్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను ఆదుకో వాలని కోరారు. ఇచ్చిన నోటిఫికేషన్లను సవరించి గిరిజన దామాషా ప్రకారం రిజర్వేషన్ పెంచితే పేద గిరిజన సమాజానికి మేలు జరుగుతుందన్నారు. అందుకు కోదండరాం సానుకూలంగా స్పందిస్తూ గిరిజనుల బాధలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాయన్నారు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేలా ఉన్నాయని చెప్పారు. గిరిజనుల కోసం ఓయూలో గిరిజన విద్యార్థులు తలపెట్టిన నిరాహార దీక్షకు తన పూర్తి మద్దతూ తెలిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని తెలిపారు. కొంత కాలంగా గిరిజన పొడుభూములు, రిజర్వేషన్ల కోసం న్యాయం జరిగే వరకు ఎంతకైనా పోరాడుతామ న్నారు. రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు రావాల్సిన హక్కు ల కోసం తెలంగాణ జన సమితి పూర్తి విధాలుగా అండ గా ఉంటుందని తెలిపారు. గిరిజనుల అభివృద్ధి విధా నాలు సమర్ధవంతంగా అమలు చేయడం లేద న్నారు. కోదండరామ్‌ను కలిసిన వారిలో గిరిజన శక్తి రాష్ట్ర ఉపా ధ్యక్షులు మాలోతు రవి నాయక్, గిరిజన శక్తి ఉస్మానియా అధ్యక్షులు హన్మంతు నాయక్, ప్రధాన కార్యదర్శి కల్యాణ్ నాయక్, బోరెల్లి ఆంజనేయులు, పరిశోధక విద్యార్థి, ప్రణరు, మహేష్, రామావత్ మోతిలాల్ ఉన్నారు.