Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలు, పెట్రోల్, వంటగ్యాస్, డీజిల్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలనీ, లేకపోతే ఉద్యమిస్తామని సీపీఐ(ఎం) మేడ్చల్ మండల సీనియర్ నాయకులు ఎక్కలదేవి కొమురయ్య అన్నారు. ధరలను తగ్గించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పేదవాడికి తినడానికి తిండిలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి పూర్తి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలను పెంచడం ద్వారా నిత్యావసర ధరలేగాక అన్నింటి పైనా ప్రభావం చూపుతుందన్నారు. వంటనూనె గతంలో ఎన్నడూ లేనంతగా రూ.220 పైగానే పెరిగిందనీ, రవాణా చార్జీలు పెరగడంతో కూరగాయల ధరలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగాయనీ, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో ఆకలి చావులు పెరుగుతాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కె.నర్సింగ్‌రావు, పి.అనిల్ కుమార్, అజరు, తదితరులు పాల్గొన్నారు.