Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలనీ, ఈ నెల 31వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద జరిగే భారీ ధర్నాకు అందరూ హాజరై విజయవంతం చేయాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్, ఎస్పీఆర్ హిల్స్‌లోని రెండు బొమ్మల సెంటర్ వద్ద సీపీఐ(ఎం) నాయకులు నిరసన తెలిపి, ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు చంద్రశేఖర రావు, సాయి శేషగిరిరావు, అశోక్, స్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం పన్నులు పెంచి, నిత్యావసర సరుకులపై ధరలు పెంచిందన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గాలంటే రేషన్ షాపుల ద్వారా 15 రకాల నిత్యావసర వస్తువులు ప్రజలందరికీ పంపిణీ చేస్తే, ధరలు తగ్గుతాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ధరలు తగ్గించే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరసింహ, సోమేశ్, లక్ష్మణ్, సుధాకర్, విజరు, సికిందర్, తదితరులు పాల్గొన్నారు.నవతెలంగాణ-జూబ్లీహిల్స్
నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలనీ, ఈ నెల 31వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద జరిగే భారీ ధర్నాకు అందరూ హాజరై విజయవంతం చేయాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్, ఎస్పీఆర్ హిల్స్‌లోని రెండు బొమ్మల సెంటర్ వద్ద సీపీఐ(ఎం) నాయకులు నిరసన తెలిపి, ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు చంద్రశేఖర రావు, సాయి శేషగిరిరావు, అశోక్, స్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం పన్నులు పెంచి, నిత్యావసర సరుకులపై ధరలు పెంచిందన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గాలంటే రేషన్ షాపుల ద్వారా 15 రకాల నిత్యావసర వస్తువులు ప్రజలందరికీ పంపిణీ చేస్తే, ధరలు తగ్గుతాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ధరలు తగ్గించే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరసింహ, సోమేశ్, లక్ష్మణ్, సుధాకర్, విజరు, సికిందర్, తదితరులు పాల్గొన్నారు.