Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యథావిధిగా టైపిస్ట్ పోస్టులను కొనసాగించాలి
నవతెలంగాణ-అడిక్ మెట్
టైపిస్ట్ పోస్టులను 330/2015 జీవో ప్రకారం యధావిధిగా టీఎస్పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికే షన్లో కొనసాగించాలని తెలంగాణ టైపిస్ట్ నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర టైపిస్ట్ నిరుద్యోగుల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద వినూత్న రీతిలో సాష్టాంగ నమస్కారాలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ 3, గ్రూప్ 4లో జీవో 330/ 2015లో 11/ 2018లో 1500 పోస్టుల్లో 460 టైపిస్ట్ పోస్టులు నోటిఫ ికేషన్ అందజేశారని తెలిపారు. నూతనంగా తీసుకువ చ్చిన జీవో 55/2022లో టైపిస్ట్ పోస్టుల ప్రస్తావన లేకుండా నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలిపారు. తద్వారా రెండేండ్లుగా 50 వేల మంది పైచిలుకు నిరుద్యోగులు శక్తి, డబ్బు, కాలం, వృథా కావడమే కాకుండా తమ అర్హతను కూడా కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టైపిస్ట్ సర్టిఫికెట్ పొంది ఉద్యోగ నోటిఫికేషన్ ఎదురుచూస్తున్న 50వేల మంది నిరుద్యోగులకు ఆత్మహత్యల శరణ్యంగా మారాయన్నారు. గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగ నోటిఫికే షన్లో టైపిస్ట్ పోస్టులను చేర్చాలనీ, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టైపిస్ట్ నిరుద్యోగులు ప్రశాంత్, గిరీష్, రాకేష్, ప్రదీప్, శ్రీకాంత్, మహేష్, సాయి, వీరేష్, తదితరులు పాల్గొన్నారు.