Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో గల విజయపురి కాలనీ ఫేస్ 2 లో నిర్మిస్తున్న కాలనీ సంక్షేమ సంఘం భవన నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పరిశీలించారు. కాలనీలలో నెలకొన్న ప్రధాన సమస్యలైన డ్రైనేజీ మరియు రహదారుల నిర్మాణాలు చేపట్టాలని కాలనీవాసులు కార్పొరేటర్‌కి వినతిపత్రం అందజేశారు. సమస్యల పట్ల స్పందించిన కార్పొరేటర్ త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని, నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని కాలనీవాసులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు పి.వి.డి.బి శర్మ, ప్రధాన కార్యదర్శి యాదగిరి, వైస్ ప్రెసిడెంట్ మురళీ, జాయింట్ సెక్రటరీ సంజీవ్ రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.