Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగు వెలిగిన మహనీయుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న డాక్టర్ అనతికాలంలో పార్టీ స్థాపించి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసి ముఖ్యమంత్రిగా ప్రజల నీరాజనాలందుకున్న నంద మూరి తారక రామారావు చిరస్మరణీయుడు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో శత జయంతి ఉత్సవాల్లో భాగం గా ఆయన కాంస్య విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ జంక్షన్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రి మల్లారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ప్రభుత్వ విప్, శేరిలింగం పల్లి ఎమ్మెల్యే ఆరికేపూడి గాంధీ, ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధుసుధన్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, నగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ , స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ దన్రాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.