Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్‌యాదవ్
నవతెలంగాణ-అంబర్‌పేట
రోడ్లపై నీరు నిల్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్‌యాదవ్ అన్నారు. స్థానికుల ఫిర్యాదుతో గణేష్ టెంపుల్ లేన్‌లో ఆదివారం కార్పొరేటర్ పర్యటించి స్ధానికులతో కలిసి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్లపై నీరు నిలువకుండా రోడ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. అనంతరం కుద్బిగూడ మహాలక్ష్మి డెయిరీ లేన్‌లో పాదయాత్ర చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో క్షీరసాగర్, ఎం.నర్సింగ్‌రావు, సుబాష్పటేల్, వాసు, తిలక్, అశోక్కులకర్ణి, హజారీబాబు, విలింద్, బీమరాజు, అరవింద్, ఆర్.సంతోష్, నాగు, ఓంకార్, రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.