Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
బీజేపీ ఖైరతాబాద్ నాయకుడు పల్లపు గోవర్ధన్ ఆదివారం ఆలయంలో గోపురం ధ్వజస్తంభం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణానికి అడ్డంకులు ఎందుకు సష్టిస్తున్నరాన్నారు. ఆలయానికి ముఖద్వారం అత్యంత ప్రాముఖ్యమైనదని, ఆలయ నిర్మాణానికి చొరవతీసుకోవాలని అనేకమార్లు స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశామన్నారు. కానీ ఆలయ ముఖ ద్వారం ఏర్పాటుకు వారు నోరు మెదపడం లేదని, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తమ నిరసన ఈ కార్యక్రమానికి తొలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సంపంగి కిరణ్, రామకృష్ణారెడ్డి, సాయరెడ్డి, యాదయ్య, అరుణ్, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.