Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాన్‌టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య చందర్
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, ఆపై పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆచార్య లింబాద్రి మీడియా ప్రకటనను ఉస్మానియా యూనివర్సిటీ నాన్‌టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సంఘం అధ్యక్షుడు సూర్య చందర్ అన్నారు. చాలీచాలని జీతాలతో దాదాపు 25 నుంచి 30 ఏండ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగిగా యూనివర్సిటీల్లో వివిధ కేటగిరీల్లో విధులను నిర్వహిస్తున్నామన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ శాసనసభలో కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అకస్మాత్తుగా టీఎస్పీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తామని అనడం కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి కుటుంబాలను రోడ్డు పాలు చేయడమే అవుతోందన్నారు. ఈప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని చైర్మెన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రెటరీ సి.శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాగిణి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్.కె.వీరేశం, యారాల రాజేష్, అజరు, రవీందర్, మల్లికార్జున్, రామ్ కుమార్, ఎం.వెంకటేష్ (జాయింట్ సెక్రటరీ), ఆర్గనైజింగ్ సెక్రెటరీలు కట్కూరి శ్రీకాంత్, చంద్రశేఖర్, హుస్సేన్ పాషా, ముజహీద్, కోశాధికారి శ్రీధర్, సెక్రెటరీలు మల్లేష్, శేఖర్, మన్నన్, నవీన్, అరుణ, వేణు, ముస్తాక్ పాల్గొన్నారు.