Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
స్వామి వివేకానంద నగర్ బస్తీ సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. స్వామి వివేకానంద నగర్ బస్తీలో వాక్స్ బోర్డుకు చెందిన సమస్యలను పరిష్కరించాలని మంత్రిని బస్తీ అధ్యక్షుడు బి.నర్సింగ్ గౌడ్ కోరిన నేపథ్యంలో ఆయన తన కార్యాలయంలో హైదరాబాద్ కలెక్టర్ ఎల్. శర్మన్, వక్స్ బోర్డ్ చైర్మెన్ మసి ఉల్లాఖాన్, డీఎస్పీ సయ్యద్ ఖాజా మోయినుద్దీన్, నాంపల్లి టీఆర్ఎస్ ఇన్చార్జ్ సీహెచ్. ఆనంద్ కుమార్ గౌడ్, నాంపల్లి ఎంఆర్వో పర్వీన్ షేక్ లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామి వివేకానందనగర్ బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని బస్తీ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్ తెలిపారు. వక్స్ బోర్డు చైర్మెన్ మసి ఉల్లాఖాన్ మాట్లాడుతూ బస్తీలో వక్ఫ్‌బోర్డుకు చెందిన సమస్యలు ఏమున్నా తన వంతు పరిష్కరిస్తానన్నారు.