Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సంగీతానికి వయసుతో నిమిత్తం లేదని, పాడే ఆసక్తి ఉండాలని విఖ్యాత గాయని పి.సుశీల అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలో ఘంటసాల మ్యూజిక్ అకాడమీ నిర్వహణలో ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని సుశీలకు నందమూరి తారక రామారావు జీవిత సాఫల్య పురస్కారం బహుకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకు గాడ్ ఫాదర్ వంటివరన్నారు. గానసభ ఆడిటోరియంలో ఉన్న ప్రముఖుల తైలవర్ణ చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని, లతా మంగేష్కర్ చిత్రం పక్కన తన ఫోటో ఉండాలని అన్నారు. రాష్ట్రపతి రాధాకష్ణన్తో తేనీటివిందు, ప్రధాని లాలబహుదూర్ శాస్త్రికి యుద్ధ సమయంలో బంగారం సహాయనిధికి ఇచ్చిన సంగతి గుర్తు చేసుకున్నారు. గాంధీ, నెహ్రులను చూడటం తన అదష్టం అన్నారు. ఇప్పటి పాటలు గురించి పెద్దగా చెప్పలేనని నాటి కాలం సినీ స్వర్ణ యుగమని, లవ కుశ, ప్రహ్లాద, మాయా బజార్ తనకు మంచి పేరు తెచ్చాయన్నారు. ఘంటసాల వల్లే తాను ఉన్నత స్థాయికి ఎదిగానని తెలిపారు. పలువురు గాయనీ గాయకులు ఎన్టీఆర్ చిత్రాలలోని గీతాలను గానం చేశారు.