Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ భాస్కర్‌రావు బొల్లినేని
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆధునిక కాలంలో చర్మ సౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కిమ్స్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ భాస్కర్ రావు బొల్లినేని అన్నారు. జూబ్లీహిల్స్‌లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ కోలా, నేయా డెర్మటాలజీ, ఎస్తటిక్స్ క్లినిక్ వ్యవస్థాపకులు డాక్టర్ రవళి, డాక్టర్ హేమంత్ కుమార్ లతో కలిసి నేయా డెర్మటాలజీ ఎస్తటిక్స్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ తరగతులు, ఇంటి నుంచి పని చేయడంతోపాటు సూర్యరశ్మికి దూరంగా ఉండడం ఏసీలో ఎక్కువ గంటలు గడపడం వంటి వాటితో చర్మ వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. నేటి తరానికి చెందిన వారిలో కొనుగోలు శక్తి పెరగడంతో చర్మాన్ని తెల్లగా మార్చే వివిధ రకాల పరికరాలను వస్తువుల వినియోగం భారీగా పెరిగిందని, కానీ దాన్ని అతిగా వినియోగిస్తే డబ్బులు ఇచ్చి రోగాన్ని కొనుక్కున్న వారవుతారని హెచ్చరించారు. కచ్చితంగా వైద్యనిపుణుల సలహాలు పాటిస్తూ అవసరం మేరకే మందులను వినియోగించాలని లేనిపక్షంలో అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని సూచించారు.