Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీవైఎల్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. కాశీనాథ్, కె.ఎస్ ప్రదీప్
నవతెలంగాణ-అడిక్మెట్
లైబ్రరీలో అన్నిరకాల పుస్తకాలు, కనీసవసతులు కల్పించడకపోవడంతో నిరుద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పీవైఎల్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. కాశీనాథ్, కె.ఎస్ ప్రదీప్ డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్లోని మార్క్స్ భవన్లో పీవైఎల్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాశీనాథ్, ప్రదీప్ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు చేసినప్పటికీ పుస్తకాలు లేకుండా అభ్యర్థులు ప్రిపరేషన్ ఎలా అవుతారని ప్రశ్నించారు. జిల్లాల్లో గ్రంథాలయాలకు వెళితే కనీస వసతులు కూడా లేవని ఆరోపించారు. ప్రయివేట్ కోచింగ్ సెంటర్లు నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా ఫీజుల పేరుతో దోపిడీ చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. తక్షణమే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పీవైఎల్ ఉపాధ్యక్షులు వి. అజరు, సుమన్, సహాయ కార్యదర్శులు టి. రాకేష్, కిషన్, కోశాధికారి ఈశ్వర్, సభ్యులు భరత్, భూషణ వేణి కష్ణ, మోహన్ రెడ్డి, గణేష్ పాల్గొన్నారు.