Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహెచ్‌బీ డివిజన్లో వసంతనగర్ పార్కు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ వసంతనగర్‌లోని పార్కును గతంలో రూ.2 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. పార్కులో మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల పరికరాలను ఏర్పాటు చేసేందుకు కోటి రూపాయాల నిధులు కేటాయించామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, కాలనీవాసులు, జీహెచ్ఎంసీ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.