Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ
- రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-అడిక్మెట్
కాచనపల్లి అమరవీరుల స్ఫూర్తితో పోరాడుదాం అని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం విద్యానగర్లోని చండ్రపుల్లారెడ్డి భవన్లో ఎన్కౌంటర్లో మరణించిన కాచనపల్లి ఆదివాసి ముద్దుబిడ్డ పూనం కోటన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాచనపల్లిలో ఆదివాసీ ముద్దుబిడ్డ పూనం కోటన్నతోపాటు నలుగురు ప్రజాసంఘాల నాయకులు గంగారం సర్పంచ్ చింతా లక్ష్మి, టేకులపల్లి ఉపసర్పంచ్ నోముల పరశురాములు, రైతు కూలీ సంఘం నాయకులు నంబూరు సీతారామారావు, సుసేనను పట్టుకుని కాల్చి వేసి ఎన్కౌంటర్ అని పోలీసులు కట్టుకథలు అల్లారు అని ఆరోపించారు. వారి ఆశయాల దారిలో ప్రజా సైన్యం లాంగ్ మార్చ్ చేస్తుందన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ మాజీ అధ్యక్షులు ఏడీ రాము, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, ప్రజాపంథా మేనేజర్ మాలిక్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు సరళ, భారతి, కీర్తి పాల్గొన్నారు.