Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్‌మెట్
నేటి సమాజంలో ప్రతి విద్యార్థికి ఆత్మసంరక్షణలో ప్రత్యేక శిక్షణ అవసరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం తైక్వాండో అసోసియేషన్ హైదరాబాద్ డిస్ట్రిక్ ఉపాధ్యక్షులు ప్రసన్న ఆంజనేయులు, సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యానగర్ పద్మాకాలనీ కమిటీ హాల్లో తైక్వాండోలో శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులకు బ్లాక్‌బెల్ట్, సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో యువత పెడదారిన పడుతూ డ్రగ్స్, గంజాయి వంటి చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు రావడానికి విద్యార్థులతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి సమాజ మనుగడలో ఎదురవుతున్న ఆటుపోట్లకు ఎదురించి పోరాడాలంటే తైక్వాండో, కరాటే వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ అవసరమని అన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జై సింహా, శ్యాంసుందర్ చిట్టి, ముచ్చకుర్తి ప్రభాకర్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.