Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్నేషనల్ వెలమ జాగతి రాష్ట్ర అధ్యక్షులు పి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-అంబర్‌పేట
వెలమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ చీఫ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఇంటర్నేషనల్ వెలమ జాగతి రాష్ట్ర అధ్యక్షులు పి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వెలమ జాతిపై చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. దామోదరం సంజీవయ్య ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో మేలు చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన అహంకారానికి కులగజ్జికి నిదర్శనం అన్నారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి కావడానికి జలగం వెంగళరావు లాంటివారు ఎంతో సహకరించారని గుర్తుచేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టి నీచమైన రాజకీయం వల్ల కాంగ్రెస్ పతనానికి దారి తీస్తుంది అని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, వెంటనే వెలమలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పొట్లపల్లి నారాయణ రావు, శ్రీనివాస రావు, చంద్రశేఖర రావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.