Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రతా చర్యలపై అవగాహన కల్పించాలి
- డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్
నవతెలంగాణ-ఓయూ
వర్షాకాలంలో నాలాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వపరంగా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం సీతాఫల్‌మండీలో వర్షాకాలంలో జాగ్రత్తలపై జలమండలి ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాము చేపట్టిన వివిధ చర్యల వల్ల సికింద్రాబాద్‌లో వర్షాకాలపు ఇబ్బందులు గణనీయంగా తగ్గాయని తెలిపారు. మ్యాన్‌హోల్ కవర్లను ప్రజలు తొలగించే పరిస్థితి నుంచి నివారించాలని సూచించారు. వివిధ భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకొనేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. నగరవ్యాప్తంగా జలమండలి అధికార యంత్రాంగం చేపడుతున్న జాగ్రత్తలను అజ్మీర కష్ణ, ప్రభు, రమణ రెడ్డి పద్మారావు గౌడ్‌కు వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, జలమండలి డైరెక్టర్ అజ్మీర కష్ణ, చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభు, జనరల్ మేనేజర్ రమణా రెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ వై.కష్ణ, మేనేజర్లు, కష్ణ ప్రసాద్, అన్వితకుమార్, స్రవంతి, నిఖిత, ప్రియాంక, నవ్య పాల్గొన్నారు.