Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రైతులు ప్రతి ఒక్కరూ ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలని నాదర్గుల్ భాగ్యనగర్ రైతు సహకార సంఘం బ్యాంక్ చైర్మెన్ మర్రి నర్సింహారెడ్డి కోరారు. సోమవారం బ్యాంకు ఆవరణలో పీఎం కిసాన్ కేవైసీ బయోమెట్రిక్ కార్యక్రమాన్ని వైస్ చైర్మెన్ బంగారి బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రైతుల కోసం విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ రుణాలు, రైతు బంధు, రైతు రుణమాఫీ తదితర పథకాలను అమలు చేయించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని లబ్దిపొందాలని రైతులను కోరారు.