Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి కోసం పాటుపడుదాం
- మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
నవతెలంగాణ-బంజారాహిల్స్
దళితులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలంటే వర్గీకరణ అంశాన్ని పక్కకి పెట్టి అభివద్ధి కోసం మాల, మాదిగలు పాటుపడాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. సోమవారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ సాధ్యం కాని అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, కానీ మందకష్ణ మాదిగ పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తి దళిత సోదరుల మధ్య తీవ్ర అగాదాన్ని సష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్గీకరణ జరిగితే మాదిగలకు12% రిజర్వేషన్లు దక్కుతాయని గోబెల్స్ ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఉపకులాల ఆధారంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో కుల గణన జరగలేదని, అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియ అని అభిప్రాయపడ్డారు. దేశం మొత్తం ఈ వర్గీకరణ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్గీకరణ చేయిస్తానని మందకష్ణకు వత్తాసు పలకడం సమంజసం కాదని అన్నారు. కిషన్ రెడ్డి వర్గీకరణ అంశాన్ని రాజకీయం కోసం వాడుకోవడం ఏ మాత్రం సమంజసమైన విషయం కాదన్నారు. దళితులు మధ్య చిచ్చు పెట్టే వారికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం నగర అధ్యక్షుడు బైడ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శశికాంత్, భాను ప్రకాష్, జగదీష్, సంగప్ప తదితరులు పాల్గొన్నారు.