Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
టీఎస్పీఎస్సీ ద్వారా యూనివర్సిటీ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేస్తే సహించేది లేదనీ, పీహెచ్డీ నోటిఫికేషన్ ప్రకటించకపోతే ప్రతిఘటన తప్పదు అని ఏఐఎస్ఎఫ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆర్ఎన్ శంకర్, ఓయూ ప్రధాన కార్యదర్శి క్రాంతిరాజ్ అన్నారు. జూన్లో పీహెచ్డీ నోటిఫికేషన్ ప్రకటించాలని సోమవారం ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. 'ఓయూలో 2018లో పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించింది. నాటి నుంచి నేటి వరకు మళ్లీ ఓయూలో పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 2 వేల టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను యూనివర్సిటీ ప్రత్యక్షంగా భర్తీ చేయాలి' అని డిమాండ్ చేశారు. అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ తొందర్లోనే పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. డిపార్ట్మెంట్ల వారీగా ఖాళీలను సేకరిస్తున్నాం అని చెప్పారు. నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సమగ్ర సమాచారం ఇంకా రాలేదన్నారు. భర్తీ ప్రక్రియ సంబంధించి ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నేతలు రాజు, జగన్, కిరణ్ పాల్గొన్నారు.