Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్పేట
పార్కులలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి స్థానికులకు అందుబాటులోకి తీసుకురావాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. హార్టీకల్చర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి గోల్నాక డివిజన్లోని పలు పార్కులను సందర్శించి, పార్కుల్లో చేపట్టాల్సిన అభివద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కుల్లో సందర్శకులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు. వద్ధులు, మహిళలు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయడం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, టైల్స్, పెయింటింగ్ పూర్తి చేసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని చెప్పారు. పార్కుల సుందరీకరణలో భాగంగా వివిధ రకాల మొక్కలను నాటడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు, పార్కుల చుట్టూ ప్రహరీ గోడను నిర్మించి గేటు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కుల వారీగా చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.