Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట ఆమ్ఆద్మీ పార్టీ ధర్నా
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలంటూ ఆమ్ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరా శోభన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలపై అనేక రకాలుగా భారం మోపుతోందన్నారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులపై ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్ శర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్లో ఓ సమావేశంలో పాల్గొని తిరిగి వస్తున్న కేంద్ర పర్యాటక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కాన్వారుని ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు వారిపై దాడికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.