Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత
నవతెలంగాణ-కేపీహెచ్బీ
నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. సోమవారం కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఉద్యానవనాల విభాగం, డిప్యూటీ డైరెక్టర్, మేనేజర్, క్షేత్రస్థాయి ఉద్యోగులు, కాంట్రాక్టర్స్తో 2022-23లో హరితహరం కార్యక్రమంలో జరిగే పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంట్రాక్టర్లు వెంటనే పనులు చేపట్టాలన్నారు. 10 రోజుల్లో మొక్కలు నాటడం పనులు పూర్తి చేయాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదేనన్నారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, పద్మనాభ, మేనేజర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.