Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలనీల్లోని సమస్యలు పరిష్కరించాలి: సీపీఐ(ఎం)
నవతెలంగాణ-అంబర్‌పేట
బాగ్‌అంబర్‌పేట డివిజన్ రామకష్ణ హట్స్, శాంతినగర్ వీకర్ సెక్షన్ కాలనీలో డ్రయినేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అంబర్‌పేట జోన్ సీపీఐ(ఎం) కన్వీనర్ ఎం.మహేందర్ డిమాండ్ చేశారు. బస్తీలలోని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం డీడీ కాలనీలోని వాటర్‌వర్క్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా డ్రయినేజీ పొంగిపొర్లుతూ దుర్గంధంతో రామకృష్ణ హట్స్, శాంతినగర్ వీకర్ సెక్షన్ ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. డ్రయినేజీ, కలుషిత నీటి సమస్యలతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారని, జల మండలి అధికారులు సత్వరమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు శేషయ్య, పర్వతాలు, యాదయ్య, వెంకటయ్య, వేమన, శ్రీనివాస్, గోపి తదితరులు పాల్గొన్నారు.