Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ
- అధ్యక్షులు నందికంటి శ్రీధర్
- అల్వాల్ తెలుగుతల్లి విగ్రహం నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు ర్యాలీ
నవతెలంగాణ-నేరెడ్ మెట్
పింఛన్లు ఇవ్వకపోతే టీఆర్ఎస్ నాయకుల ఇండ్లు, జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. వృద్ధాప్య, వితంతు, వికలాం గుల పింఛన్ల కోసం సోమవారం అల్వాల్ సర్కిల్ తెలుగుతల్లి విగ్రహం నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట డిప్యూటీ కమిషనర్ నాగమణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏండ్లయినా మూడేండ్ల నుంచి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్లు ఫించ న్లకు దరఖాస్తు చేసి మూడేండ్లు అవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరేతనట్టుగా వ్యవహరిస్తుందన్నారు. అధికారులు కూడా స్పందించడం లేదన్నారు. గతంలో కూడా తమ పార్టీ తరుపున రిప్రజంటెషన్ ఇచ్చినట్టు గుర్తు చేశారు. గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెద్ద కొడుకు లాగా వృద్ధులందరికీ 1 నుంచి 5వ తేదీ లోపు ఇచ్చేవారని తెలిపారు. వృద్ధులకు ఇచ్చే రూ.2 వేలు తమకు మందు గోళీలకు, చిన్న చిన్న అవసరాలకు వస్తుందని ఓటేశారని తెలిపారు. పింఛన్లు ఇవ్వకపోతే వారు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. మూడేండ్లుగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు తీసుకుని జీహెచ్ఎంసీ అధికారులు కలెక్టర్‌కి పంపామనీ, కలెక్టర్‌ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మంజూ రు చేయడం లేదని చెబుతున్నట్టు తెలిపారు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలే ప్రజలను నట్టేట్ల ముంచితే ఏ ప్రభుత్వాలు నిలకడగా లేవన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మ అశోక్ రెడ్డి, డోలి రమేష్, చంద్రశేఖర్, సీఎల్ యాద గిరి, జి.కృష్ణాగౌడ్, టీఎస్ సంజీవ్ కుమార్, సంతోష్ రెడ్డి, ప్రభాకర్, సూర్యప్రకాష్ రెడ్డి, పవన్ కుమార్, రాజలింగం, వాసు, శివకుమార్, శ్రీనివాస్ గౌడ్, గణేష్, రాజు, స్వామి, ప్రవీణ్ గౌడ్, పాండు, బాలపీరు, సుదర్శన్ రెడ్డి, సుధా కర్‌రెడ్డి, లింగారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, రాములు, శంకర్, సూర్యప్రకాశ్, వినోద్ యాదవ్, సంతోష్, శ్రీనివాస్, వీనస్ మేరీ, లక్ష్మి, ఫహీమ్, ఆశారాణి, నిర్మలా రాజ్, సమీనా బేగం, సుభాషిణి పాల్గొన్నారు.