Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో హరితహారం పెంచేందుకు చర్యలు
- రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ
- మంత్రి చామకూర మల్లారెడ్డి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారనీ, ఈ విషయంలో ఆయన ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నా రనీ, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరీశ్, జెడ్పీ చైర్మెన్ శరత్‌చంద్రారెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై మున్సిపాలిటీల్లో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలనీ, అందుకు ఆయా మున్సిపల్ కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, ప్రత్యేక శ్రద్ధతో పాటు అందరూ కలిసి సమన్వయంతో పని చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని వివరించారు. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందడానికి ఇది ఎంతో గొప్ప అవకా శమన్నారు. జిల్లాలో ఉన్న 61 గ్రామపంచాయతీల్లో హరితహారం, పల్లె ప్రగతి, కార్యక్రమాలు ఎంతో బాగా కొనసాగుతున్నా మున్సిపాలిటీల్లో అంతగా జరగడం లేదని అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వ యంతో పని చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామ న్నారు. జిల్లాలోని ఆయా పట్టణాల్లో హరితహారం పెంచేందుకు కృషి చేయాలనీ, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైన చోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మూడు లేయర్లలో మొక్కలను నాటాలననీ, పచ్చదనం పెంచాలన్నారు. హరి తహారంతో పాటు అన్ని రంగాల్లో జిల్లాను రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచాల న్నారు. ఈనెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో మమేకమై పాల్గొనాలనీ, ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ తగదన్నారు. ప్రజాప్రతినిధులు చేసే పనులు ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా ఉండాలన్నారు. పట్టణ ప్రగతిలో చైర్మెన్లు, మేయర్లు, కార్పొరేటర్లు సరిగ్గా పని చేయాలనీ, వారు పని చేయకపోతే వారిపై తగిన చర్యలు (యాక్షన్) తీసుకునేందుకు జిల్లా కలెక్టర్‌కు పూర్తి అధికారాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం సూచించిన చోట్ల క్రీడా మైదానాలను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభించేలా చర్యలు చేపట్టాలనీ, అందుకు క్రీడామైదానాల త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి వివరించారు. జిల్లాలోని పోచారం మున్సిపాలిటీకి హరితహారంలో ప్రథమ బహుమతి లభించిందనీ, అదే స్ఫూర్తితో మిగిలిన మున్సిపాలిటీలు తమకు గుర్తింపు వచ్చేలా పోటీపడి బహుమతులు సాధించాలని సూచిం చారు. ఈ విషయంలో ప్రభుత్వ సహకారంతోపాటు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటాలనీ, అవసరమైతే మొక్కలను నర్సరీల నుంచి తెప్పించుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ఆయా మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, కింది స్థాయి ఉద్యోగులు ముందస్తు ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) తయారు చేసుకోవాలనీ, అందుకు గ్రీన్ బడ్జెట్ వాడుకోవా లని తెలిపారు. జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల దేశంలో తెలంగాణ ఆరు నుంచి ఏడు శాతం పచ్చదనం పెరిగినట్టు భారత ప్రభు త్వం (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) తెలిపిందనీ, ఇదే స్ఫూర్తితో పచ్చదనం పెంపొందించేందుకు మరింత అవసరమైన కార్యాచరణతో ముందుకెళ్ళాలని సూచించా రు. గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతివనాలు, నర్సరీలు ఉండేలా చూడాలన్నారు. దేశంలో 20 ఉత్తమ గ్రామాల్లో 19 మనవే. అనీ, 10 కి 10 ఆదర్శ గ్రామాలు కూడా మనవే అని తెలిపారు. హరితహారం కార్యక్రమంపై మరింత దృష్టి కేంద్రీకరిం చాలని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి మాట్లడుతూ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సమన్వయంతో కలిసి విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందు స్థానంలో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, మేయర్లు, మున్సిపల్ చైర్మెన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.