Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎన్జీవోస్ కేంద్ర సంఘ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాహుల్ బొజ్జాను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా.. వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఉద్యోగులు కష్టపడి పనిచేసి డిపార్టు మెంట్కు మంచిపేరు తీసుకురావాలని, త్వరలోనే సెంట్రల్ యూనియన్ నాయకుల సహకారంతో డిపార్టుమెంట్లోని ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ముజీబ్ అన్నారు. ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో మంగళవారం ముజీబ్ ఆధ్వర్యంలో అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రోగుల సుమారు 700 మంది రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్.విక్రమ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కుర్రాడి శ్రీనివాస్, సభ్యులు వైదిక్ శాస్త్ర, నాలుగో తరగతి నాయకులు ఎం.ఏ.ముజీబ్, యూనిట్ సభ్యులు శివకుమార్, శేఖర్ పాల్గొన్నారు.