Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని రాజీవ్‌గృహకల్ప సమీపంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని, మరో చోటుకు మార్చాలని ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా చింతల్ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్‌లో శ్మశాన వాటిక అభివృద్ధికి మంజూరైన నిధులతో పనులను వెంటనే చేపట్టి మోడర్న్ గ్రేవ్ యార్డుగా తీర్చిదిద్దాలని కోరుతూ స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి విన్నవించారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు మారయ్య, ప్రభాకర్, రాజీవ్‌గృహకల్ప వాసులు పుల్లారెడ్డి, సుధాకర్‌రెడ్డి, తివారి, రవి, రవీందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్ టి.లక్ష్మారెడ్డి, చంద్రానగర్ అడ్వైజర్ కృష్ణమూర్తి, సూర్య ప్రకాష్‌రావు, గ్రేవ్ యార్డు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.