Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్
- బీమా భవన్లో రక్తదాన శిబిరం
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదానం చేయడం అభినందనీయం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంగళవారం అబిడ్స్‌లోని బీమా భవన్లో టీఎస్సీపీఎస్ఈయూ హైదరాబాద్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈకార్యక్రమానికి సుమన్ హాజరై మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా గొప్ప విషయం అని ప్రశంసించారు. రాష్ట్రంలో ఉన్న ఇతర సంఘాలు ఈప్రోగ్రామ్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఏఎన్ఎం ఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ సామాజిక భద్రత కోరుకునే ఉద్యోగి సామాజిక బాధ్యతను నెరవేరుస్తాడు అనే దక్పథంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం ప్రశంసనీయమని హైదరాబాద్ శాఖకు కతజ్ఞతలు తెలిపారు. 80 మందికి పైగా ఉద్యోగులు రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి, సమీనా, మల్లికార్జున్, జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు, గౌరవ అధ్యక్షుడు కోటకొండ పవన్, కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి కరుణ, ఉపాధ్యక్షులు శ్రీవాణి, అరవింద్, కిరణ్, శ్యామ్ కుమార్, ప్రవీణ్, రాజేష్, డాక్టర్ శ్రావణ్ కుమార్, స్టాఫ్‌నర్స్ రాజ్యలక్ష్మి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.