Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్లోని 21వ వార్డు వాది హే ముస్తాఫా కాలనీలో డ్రైనేజీలు లేకపో వటంతో ఇండ్ల నుండి వచ్చే మురికి నీరు రోడ్లపై ప్రవహి స్తున్నా అధికారులు ఎవ్వరు పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో కాలంగా కాలనీలో డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, విద్యుత్ దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు విన్నవించినా ఎవ్వరు పట్టిించుకోవటంలేదన్నారు. మురికి నీరు రోడ్లపైకి చేరి గుంతలు ఏర్పడటంతో, దోమలకు నిలయాలుగా మారి దోమ కాటుకు కాలనీ వాసులు రోగాల బారినపడుతున్నారని తెలిపారు. కాలనీలో మున్సిపల్ సిబ్బంది దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ చేయటంలేదన్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి కాలనీలో ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం డ్రైనేజీ నిర్మాణ పనులతో పాటు ప్రతి సమస్యను పరిష్కారం చేసి ఆదుకోవాలని, కాలనీ అధ్యక్షులు సాలే బవజీర్ కోరారు. కాలనీ సమస్యలు పరిష్కరించాలని కౌన్సిల షేక్ పమీద అఫ్జల్ ను కాలనీవాసులు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైన మున్సిపల్ కమిషనర్ డా.జి.ప్రవీణ్ కుమార్ కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలను పరిస్కారం చేయాలని కోరారు.